● వాటర్.. షివర్
కందుకూరు: నేదునూరు పరిధిలోని సాంఘీక సంక్షేమ వసతి గృహంలో మొత్తం 70 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం 58 మంది ఉన్నారు. ప్రభుత్వం బెడ్‌షీట్లు, రగ్గులు సరఫరా చేసింది. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ పాడై మూడేళ్లయింది. ఇంత వరకు మరమ్మతులు చేయించలేదు. బయటి నుంచి తాగునీరు తెప్పిస్తున్నారు. మరోవైపు చల్లని చలిలో చన్నీటి స్నానాలు చేయాల్సి వస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల భవనంపై ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్ పాడై ఏడాదైంది. వాడిన వృథా నీరు బయటికి వెళ్లే మార్గం లేక ఆవరణలోనే చేరి దుర్వాసన వెదజల్లుతోంది.
వేడి నీళ్లు వస్తే బాగుండు
రోజు ఉదయం చల్లని నీటితో స్నానం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. వాటర్ హీటర్‌కు మరమ్మతులు చేయిస్తే వేడి నీళ్లు వస్తాయి.
– వరప్రసాద్, 7వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment