● ఉలెన్ దుప్పట్ల ఊసే లేదు
కడ్తాల్: మండల కేంద్రంలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలతో పాటు మండల పరిధిలోని మైసిగండిలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, ముద్వీన్ గ్రామంలో సాంఘీక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాలు ఉన్నాయి. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల్లో 282 మంది విద్యార్థులు ఉండగా, మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 394 మంది విద్యాభ్యాసం సాగిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఆయా ఆశ్రమ పాఠశాలల్లో చాలినన్ని మంచాలున్నా పరుపులు లేవు. బెడ్‌షీట్లు అందజేసినా చలి నుంచి అంతగా రక్షణ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం రెండేళ్ల క్రితం ఉలెన్ దుప్పట్లు అందజేశారని, మళ్లీ ఇంత వరకు ఇవ్వలేదని విద్యార్థులు వాపోతున్నారు. సోలార్ వాటర్ హీటర్ల సదుపాయం లేకపోవడంతో ఆరుబయట వణికించే చలిలో కుళాయిల వద్ద చన్నీళ్లతో స్నానాలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. మైసిగండి ఆశ్రమ పాఠశాలలోని ఒక గది కిటికీలకు రెక్కలు లేకపోవడంతో చలి తీవ్రత, దోమల దాడిని తట్టుకునేందుకు రాత్రి వేళ అడ్డంగా దుప్పటి అడ్డుపెడుతున్నారు. కొంత మంది చలి నుంచి రక్షణకు ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చకుని కప్పుకొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment