సీసీఐ కేంద్రాలను వినియోగించుకోవాలి
చేవెళ్ల: పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. మండల పరిధిలోని దామరగిద్ద సమీపంలో ఉన్న శ్రీనివాస కాటన్‌మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్తిని ఎలా కొనుగోలు చేస్తున్నారు.. ఎలా తూకం వేస్తున్నారు.. తేమశాతం ఎలా చెక్ చేస్తున్నారనే విషయాలను స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మద్దతు ధరలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు అందుబాటులో ఉంటారని రైతులకు ఏవైనా సమస్యలుంటే వారిని సంప్రదించాలని సూచించారు. పత్తి అమ్మకానికి తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట చేవెళ్ల వ్యవసాయశాఖ ఏడీ సురేశ్‌బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి. రాములు, మార్కెట్ కార్యదర్శి మహేందర్, మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్, ఏఈఓలు రమ్య, స్వాతి, బాలకృష్ణ, సీసీఐ ప్రతినిధి రాజీవ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment