ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
హుడాకాంప్లెక్స్: ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సంధ్యారాణి అన్నారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడాపోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సరూర్‌నగర్ స్టేడియంలో రన్నింగ్, షాట్‌పుట్, చెస్, క్యారమ్స్, వీల్‌చైర్, ట్రై సైకిల్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 500 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకల్యం లక్ష్యసాధనకు అడ్డు కాదని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment