ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపా లని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమ వారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 52 అర్జీలు రాగా, వీటిలో 42 రెవెన్యూ సంబంధితమైనవేనని చెప్పారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజావాణి దరఖాస్తులపై డిసెంబర్ 9న సమీక్ష ఉంటుందని చెప్పారు. సమగ్రకుటుంబ సర్వే డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment