హిందూ దేవాలయాలకు భద్రత కరువు
షాద్‌నగర్‌రూరల్: రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఫరూఖ్‌నగర్ (వివేకానందనగర్)లోని బసవన్న దేవాలయంలో శివలింగం చోరీ నేపథ్యంలో శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు కుట్ర పూరితంగా దాడులు చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం చేస్తున్నారని అన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, మతకల్లోలాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆలయాల్లో సరైన నిఘా ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పదించాలని డిమాండ్ చేశారు. శివలింగాన్ని ఎత్తుకెళ్లిన వారు ఎవరు, ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, నాయకులు చెంది మహేందర్‌రెడ్డి, సుభాష్, శివానందస్వామి, చెట్ల వెంకటేశ్, ఆకుల ప్రదీప్, మల్చలం మురళి, ప్యాట అశోక్, కాసోజు శివ, మఠం రుషికేష్, ఎంకనోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర
సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment