క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలి
నందిగామ: విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమ శిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని ఇందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం అన్నారు. మండల పరిధిలోని కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ లెర్నింగ్ సెంటర్ స్కూల్‌లో బుధవారం పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. వెంకటేశం హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా ‘ఆనందోత్సవం అతుల్యం భారతం’ అనే పేరుతో భారత దేశంలోని సాంస్కృతిక సంప్రదాయాలు, పండగలు, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన పలు కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు, నాటకాలు, సంగీత కచేరీలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం
Comments
Please login to add a commentAdd a comment