పారిశ్రామికవేత్తలు సహకరించాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పారిశ్రామిక వేత్తలు తమ సామాజిక బాధ్యతగా విద్య, వైద్యం మెరుగు కోసం తమవంతు సహకారాన్ని అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య కోసం అన్ని పరిశ్రమలు సామాజిక బాధ్యత కింద సహకరించాలని కోరారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. ఇప్పటికే వివిధ రంగాల్లో సామాజిక బాధ్యత కింద సహకారం అందిస్తున్న పారిశ్రామికవేత్తలందరినీ అభినందించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా అధికారి శ్రీలక్ష్మి, ప్రధాన పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
Comments
Please login to add a commentAdd a comment