500 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
మునిపల్లి(అందోల్): బుదేరా ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ ఆధ్వర్యంలో 500 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నట్లు కొండాపూర్ సీఐ వెంకటేశ్ తెలిపారు. ఈ నెల 20న కంకోల్ టోల్‌ప్లాజా సమీపంలో బుదేరా పోలీసులు, టాక్స్‌ఫోర్స్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు డిక్కిలో పాలిథిన్ కవర్‌లో 500 గ్రాముల ఎండు గంజాయి దొరికిందని అన్నారు. బీదర్ చిద్రి రోడ్‌కు చెందిన రేష్మాబేగం, భర్త జాఫర్ అలీ, బీదర్ గాంధీ గంజ్ భద్రుద్దీస్ కాలనీకి చెందిన జాఫర్ అలీలు ఇద్దరు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిందన్నారు. దీంతో ముగ్గురు వ్యక్తులకు గంజాయి సరఫరా చేసిన మహాబుబ్ నగర్‌టౌన్‌కు చెందిన మహామ్మద్ అజీ, మోహమ్మద్ మోహరాజ్ అహ్మద్, ఇల్లియాజ్ ఖాన్‌లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. గంజాయి సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, త్వరలో పట్టు కుంటామన్నారు. బుదేరా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ చెన్నూర్ రూపేశ్ అభినంధించినట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బుదేరా పోలీస్ సిబ్బంది సుంధర్‌రాజ్, మహామ్మద్ హనీఫ్, గణపతిరావు, పాండుతో పాటు పాల్గొన్నారు.
నిషేధిత మత్తు పదార్ధం స్వాధీనం:
పంజాబీ హోటల్ యజమాని అరెస్టు
వెల్ధుర్తి(నర్సాపూర్): మాసాయిపేట మండల కేంద్ర ం సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ పంజాబీ దాబాలో గురువారం ఎకై ్సజ్ అధికారులు సోదా లు నిర్వహించారు. నిషేధిత మత్తు పదార్థం పాపిష్టి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీణారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. 128 గ్రా ముల పాపిష్టి మత్తు పదార్ధాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఇది నిషేధిత పదార్ధమని, అమ్మడం, కొన డం నేరమని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు దాబా యజమాని రవీందర్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
53 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
సిద్దిపేటఅర్బన్: అక్రమంగా తరలిస్తున్న 53.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. బుధవారం రాత్రి పొన్నాల శివారులో సీఐ విద్యాసాగర్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో 85 సంచులలో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఎలాంటి రశీదులు చూపించకపోవడంతో డ్రైవర్ శేఖర్‌ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసినట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment