పటాన్‌చెరు: గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐలాపూర్ గ్రామ కార్యదర్శిగా పనిచేసిన సచిన్.. ఇంటికి నంబర్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. బాధితులు తలారి మల్లేశ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు గురువారం అమీన్‌పూర్ మున్సిపల్ కార్యాలయంలో గ్రామ రికార్డులను పరిశీలించారు. అనంతరం సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐలాపూర్ గ్రామం ఇటీవలే అమీన్‌పూర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యింది. ఈ నేపథ్యంలో పంచాయతీ రికార్డులని మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాయి. ప్రస్తుతం ఐలాపూర్ కార్యదర్శి అయిన సతీష్‌ను వెంట బెట్టుకుని వచ్చిన ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు లభించడంతో నిందితుడు సచిన్‌ను అదుపులోకి తీసుకన్నట్లు సీఐ రమేష్ తెలిపారు. ఇదిలా ఉంటే సచిన్ ఇక్కడ నుంచి బదిలీ అయిన తర్వాత కూడా లంచం డిమాండ్ చేయడంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యదర్శిగా సచిన్ పనిచేసినప్పుడు తలారి మల్లేశ్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో రూ.10వేలు సచిన్‌కు ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో రికార్డులు కూడా మల్లేష్ వద్ద ఉన్నాయి. తాజాగా సచిన్.. మల్లేష్‌కు ఫోన్ చేసి మిగతా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.15 వేలు ఇస్తానని మల్లేశ్ తెలిపారు. అయితే ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ముందే ఫిర్యాదు చేశారు. లంచం ఇస్తూ మల్లేశ్ వీడియో రికార్డు చేశారు. ఏసీబీ అధికారులకు లభించిన వీడియో అధారంగా సచిన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు వంద ఇంటి నంబర్లను కేటాయిస్తూ తప్పుడు రికార్డులు సృష్టించారని సచిన్‌పై అభియోగాలు సైతం ఉన్నాయి.
ఇంటి నంబర్ ఇచ్చేందుకు లంచం డిమాండ్
ఐలాపూర్ నుంచి బదిలీ అయినా వదలని అధికారి
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రికార్డులు పరిశీలించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment