శ్రీనివాసమూర్తిపంతులుకు గౌరవ డాక్టరేట్
సదాశివపేట(సంగారెడ్డి): జ్యోతిష్య వాస్తు శాస్త్రాలపై చేస్తున్న పరిశోధన, విశేష సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకుగాను పురో హితుడు కె.శ్రీనివాసమూర్తి పంతులుకు ఢిల్లీలోని ప్రపంచ సంస్కృతి, పర్యావరణ పరిరక్షన కమిషన్ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. ప్రధానమంత్రి సంగ్రహాలయంలోని నెహ్రూ ఆడిటోరియంలో ఈ నెల 20న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి పంతులుకు పట్టాను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు వింధు ధారాసింగ్, మాజీ టిబెటన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ ఆచార్య ఏషీ పుష్ణాక్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మాజీ సెక్రటరీ జనరల్ రోహిత్ పాండే తదితరులు హాజరయ్యారు.
‘మందులు అందుబాటులో ఉంచాలి’
సంగారెడ్డి టౌన్: రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వో గాయత్రీదేవి అన్నారు. సంగారెడ్డి మండలంలోని చింతల్‌బస్తీ, మార్చినగర్‌లో శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. మందులను భద్రపరిచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న
హత్నూర(సంగారెడ్డి): గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హత్నూర మండలం లక్మాతాండాలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం వాటర్ ట్యాంక్‌తోపాటు గ్రామంలో మురికి కాల్వలను శుక్రవారం డిప్యూ టీ సీఈవో స్వప్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామాలలో పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంగన్‌వాడీలో బాలింతలకు, గర్భిణి లకు పిల్లలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు. అంతకుముందు హత్నూర మండల పరిషత్ కార్యాలయంలో కుటుంబ సమగ్ర సర్వే వివరాల ఎంట్రీని జిల్లా పరిషత్ స్వప్న పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment