ఏం చర్యలు తీసుకుంటారు
జహీరాబాద్ టౌన్: అదానీ విషయంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్‌గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. అదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఒప్పందాలు చేసుకున్నారని మరి రేవంత్‌పై రాహుల్ గాంధీ ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. జహీరాబాద్‌లో శుక్రవారం జరిగిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అమెరికాలో అదానీపై వచ్చిన ఆరోపణలు పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాల్లో అవినీతి జరిగిందని తెలుస్తోందని అందులో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలేనన్నారు. మిగి లిన రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ మిత్రపక్షం అధికారంలో ఉందనే విషయం మరిచి రాహుల్ తమ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సమావేశాల్లోనే వక్ఫ్‌బోర్డు బిల్లు
ఈ పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు బిల్లు రాబోతుందని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. దేశంలోని అందరి హక్కులను కాపాడేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. తీసుకురానున్న వక్ఫ్ బిల్లు చట్టం ద్వారా అన్ని వర్గాల భూముల పర్యవేక్షణ కలెక్టర్‌కు ఉంటుందన్నారు. ఎంపీ రఘునందన్‌రావు వెంట మాజీ ఎంపీ బీబీపాటిల్, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదానీ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు
ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్న
రాహుల్‌గాంధీ అవగాహన లేకుండా
మాట్లాడుతున్నారని మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment