సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్‌

Published Thu, May 9 2024 10:10 AM

సుప్ర

కొండపాక (గజ్వేల్‌): దుద్దెడ శివారులో నాగులబండ వద్ద సుప్రీంకోర్టు మాజీ జడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కమిషన్‌ చైర్మన్‌ పినాక చంద్రఘోష్‌ను బుధవారం కలెక్టర్‌ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. రామగుండం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో ఓ హోటల్‌లో తేనీటి విందు స్వీకరించే క్రమంలో కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కలిశారు. కలెక్టర్‌ వెంట పోలీస్‌ అదనపు డీసీపీ (అడ్మిన్‌) మల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరాం తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన

న్యాయమూర్తిని కలిసిన సీపీ

సిద్దిపేటకమాన్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవిని పోలీసు కమిషనర్‌ అనురాధ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి చర్చించారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో అదనపు డీసీపీ మల్లారెడ్డి ఉన్నారు.

మల్బరీ తోటల పరిశీలన

నంగునూరు(సిద్దిపేట): ముండ్రాయిలో వర్షానికి దెబ్బతిన్న మల్బరీ తోటలను బుధవారం పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పరిశీలించారు. రైతు రాగుల రాజు రెండెకరాల మల్బరీ సాగు చేయగా అకాల వర్షానికి పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షానికి పురుగులు చనిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడీఏ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేసి రైతుకు పరిహారం అందేలా చూస్తామన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి

మిరుదొడ్డి(దుబ్బాక): ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాఽధించవచ్చని ఆయిల్‌ ఫెడ్‌ డిప్యూటీ మేనేజర్‌ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెప్యాలలో ఆయిల్‌పామ్‌ సాగుపై హార్టికల్చర్‌ అధికారులు బుధవారం రైతులకు క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు. డ్రిప్‌, స్ప్రింక్లర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ సాగుపై అవగాహన పెంచుకోవాలని చూచించారు. కార్యక్రమంలో డీఐ శంకర్‌, హార్టికల్చర్‌ ఏఈ అనిల్‌కుమార్‌, వ్యవసాయ విస్తరణ అధికారి రేణుక, ఆయిల్‌ఫెడ్‌ డీసీఓ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

‘బాల పురస్కార్‌’కు

దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేటరూరల్‌: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆపదలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటంలో ధైర్యసాహసాలు చూపినవారు, సాంస్కృతిక కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనభరిచిన వారు అర్హులని తెలిపారు. వారి వివరాలను ఉపాధ్యాయులు, బాలలు, సంస్థలు అన్ని పత్రాలతో ఆన్‌లైన్‌లో జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న బాలలకు డిసెంబర్‌ 26న వీర్‌ బాల్‌ దివస్‌ పురస్కరించుకుని అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ http://awards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్‌
1/2

సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్‌

సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్‌
2/2

సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement