రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.కనకారెడ్డి అన్నారు. చేర్యాలలో శనివారం జరిగిన సీపీఎం 20వ పట్టణ మహాసభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికై న చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు నియోజకవర్గ కేంద్రం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా అనేక పోరాటాలు చేశామన్నారు. చేర్యాల అస్తిత్వాన్ని కాపాడాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ఆ దిశగా చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలను కలిపి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి, పాత చేర్యాల నియోజకవర్గాన్ని పునరుద్ధరించే వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు సాగిస్తామన్నారు. ఈ మహాసభలో సీపీఎం నాయకులు శ్రీహరి, శోభ, ప్రభాకర్, మల్లారెడ్డి, గోపాలస్వామి, వెంకట్, రవికుమార్, అరుణ్‌కుమార్, ప్రశాంత్, నాగరాజు, నర్సారెడ్డి, భాస్కర్, రంజిత్‌రెడ్డి, మల్లేశం, అశోక్, చందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment