హోమియో క్లినిక్ సీజ్
సిద్దిపేటకమాన్: ‘అర్హత లేకున్నా.. చికిత్స’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. పట్టణంలోని భరత్‌నగర్‌లో క్లినిక్‌ను ఏర్పాటు చేసి రిటైర్డ్ ఫార్మసిస్టే డాక్టర్‌గా వ్యవహరిస్తూ వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం సాక్షి పరిశీలన ద్వారా ప్రత్యేక కథనం ద్వారా ప్రచురించింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం సదరు క్లినిక్ పరిశీలించి, సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు నిర్వహించినా.. అర్హత లేని వారు వైద్య సేవలు అందించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రుల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ రేవతి, డాక్టర్ శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment