ఎస్సీ వర్గీకరణ తగదు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ తగదు

Published Sat, Nov 23 2024 7:56 AM | Last Updated on Sat, Nov 23 2024 7:56 AM

-

● జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌

మిరుదొడ్డి(దుబ్బాక): రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మానుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలంలో ప్రారంభించిన మహా పాదయాత్ర శుక్రవారం మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చేరుకుంది. మహా పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల్ని విడదీసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు త్వరలోనే మాలలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 16 జిల్లాలోని 35 నియోజకవర్గాలు, వెయ్యి కిలో మీటర్లు, 38 రోజుల పాటు మాలల మహాపాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పాదయాత్ర ముగింపును డిసెంబర్‌ ఒకటిన హైదరాబాద్‌లో మాలల మహా సంగ్రామ సభను నిర్వహిస్తామన్నారు. సభకు మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, రాష్ట్ర పొలిట్‌ బ్యూరో చైర్మన్‌ ర్యాకం శ్రీరాములు, జై బీం సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement