సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
వర్గల్(గజ్వేల్): సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తక్షణమే పేస్కేల్ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, కేజీబీవీ ప్రత్యేక అధికారి రజిత, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, సీఆర్‌పీలు, ఐఈఆర్‌పీలు, సీఆర్‌టీలు, నాన్‌టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు
కలిగించొద్దు
దౌల్తాబాద్(దుబ్బాక): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని జిల్లా ప్రాజెక్ట్ అధికారి రాజయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాప్యం లేకుండా కొనుగోళ్లను వేగిరంచేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రంలో ఎమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ యాదగిరి, సీసీ విజయలక్ష్మి, వీఓఏ రజిత, కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న క్రిస్టియన్లను క్రిస్మస్ వేడుకల్లో సత్కరించనున్నామని, అందువల్ల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి షేక్ వలీ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక సేవ రంగం, వైద్యసేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు, క్రీడారంగాలలో పది సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న క్రిస్టియన్లు, సామాజిక సేవా రంగం, విద్యరంగంలో 30 ఏళ్లుగా సేవలు చేస్తున్న క్రిస్టియన్ సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 12లోగా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలన్నారు.
పెద్దిరాజుకు అరుదైన గౌరవం
మిరుదొడ్డి(దుబ్బాక): గజ్వేల్ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కొండాపూర్‌కు చెందిన పెద్దిరాజుకు అరుదైన గౌరవం లభించింది. కళాశాలలో ప్రొఫెసర్‌గా విద్యార్థులకు బోధించిన సామాజిక అంశాలతో పాటు, భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో పెద్దిరాజును ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్టుమెంట్ హెచ్‌ఓడీ కృష్ణకుమార్, హైదరాబాద్ సివిల్ కోర్టు జడ్జీ సాయికుమార్‌లు సన్మానించి జ్ఞాపికను అందించారు. పెద్దిరాజుకు అరుదైన గౌరం లభించడం పట్ల కొండాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
శైలజ మృతికి
ప్రభుత్వానిదే బాధ్యత
బెజ్జంకి(సిద్దిపేట): వాంకిడిలో విద్యార్థి శైలజ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌వీ నాయకుడు రావుల రాజు డిమాండ్ చేశారు. బెజ్జంకిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ విద్యార్థి గిరిజన వసతి గృహంలో కలుషితమైన ఆహారం తీసుకోవడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో కొరివి తిరుపతి, సురేశ్, మహేశ్, మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment