మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా
సిద్దిపేటకమాన్: మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు. బుధవారం నార్కోటిక్స్ డాగ్స్‌తో పట్టణంలో అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ వాసుదేవరావు మాట్లాడుతూ.. పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో, పాన్ షాప్‌లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు ఎవరైనా కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నా, విక్రయించినా డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు తెలపాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐలు కనకయ్యగౌడ్, కొమురయ్య, పోలీసు సిబ్బంది రామ్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట పట్టణంలో నార్కోటిక్ డాగ్స్‌తో తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment