కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో వివిధ విభాగాలకు సంబంధించిన ఆడిట్ ఫైళ్లు మాయమయ్యాయి. ఈ క్రమంలో గతంలో ఇక్కడ పని చేసిన ముగ్గురు ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. 2014 ఏప్రిల్ నుంచి మార్చి 2017 వరకు చేపట్టిన ఆలయ ఆదాయ వ్యయాలపై గతంలో ఆడిట్ నిర్వహించారు. సుమారు రూ.3కోట్ల మేర లావాదేవిలపై ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు వ్యక్తం చేశారు. దీంతో 2018లో అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ 2014 ఏప్రిల్ నుంచి మార్చి 2017 వరకు పని చేసిన ఆలయ ఈఓలు, పలువురు ఉద్యోగులకు సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడంతో కొంత మేరకు మెజర్మెంట్ బుక్‌లు, బిల్లులు సమర్పించారు. ఇంకా రూ.కోటికిపైగా ఆడిట్ అభ్యంతరాలకు ఎలాంటివి చూపలేదు. అయితే ఇటీవల అధికారులు రికార్డుల పరిశీలనలో ఫైళ్లు మాయమైన విషయం గుర్తించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు నీల శేఖర్, జగన్, నర్సింహులుకు నోటీసులు జారీ చేశారు. ఆడిట్‌కు సంబంధించిన ఫైళ్లు దేవాలయంలో అందుబాటులో లేవని వెంటనే అందించాలని, లేనట్లయితే శాఖా పరమైన చర్యలు చేపడతామని హెచ్చరించినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
ముగ్గురు ఉద్యోగులకు మెమోలు జారీ కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వెలుగులోకి..
Comments
Please login to add a commentAdd a comment