ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం
గజ్వేల్: ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం లభిస్తుందని ఆయిల్‌ఫెడ్ సంస్థ జిల్లా ఇన్‌చార్జి అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో ఆయిల్‌పాం సాగు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సాగులో మెలకువలపై రైతులకు అవగాహన కల్పించారు. మొదటి మూడు సంవత్సరాల వరకు ఆయిల్‌పాంలో అంతర పంటల సాగుతో ఆదాయం సమకూరుతుందని, నాలుగో ఏటా పంట చేతికివచ్చి ఆదాయం మొదలవుతుందని చెప్పారు. చీడపీడల బెదడ కూడా తక్కువేనని చెప్పారు. ఆసక్తి గల రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయాధికారి నాగరాజు, ఉద్యానవనశాఖాధికారిణి సౌమ్య, ఏఈఓ మాధవీ తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌ఫెడ్ సంస్థ జిల్లా ఇన్‌చార్జి అనిల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment