ఆర్చ్ఫార్మా కార్మికులను ఆదుకోండి
సిద్దిపేటరూరల్: మిట్టపల్లిలోని ఆర్చ్ ఫార్మా ల్యాబ్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను, కార్మికులను ఆదుకోవాలంటూ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం బీఎంఎస్, ఆర్చ్ఫార్మ కంపెనీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ మనుచౌదరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అందులో పనిచేసే కార్మికుల భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. కంపెనీపై ఆధారపడి సుమారు 400 కుటుంబాలు 25 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాయన్నారు. 3 నెలలుగా వేతనాలు సరైన సమయానికి ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టి కార్మికులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కలాల్శ్రీను, అర్చ్ఫార్మ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరికి వినతి
Comments
Please login to add a commentAdd a comment