బాల్య వివాహాలతో తీరని నష్టం
సిద్దిపేటకమాన్: బాల్య వివాహాల వల్ల భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతుందని నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. సిద్దిపేట కోర్టు భవనంలో బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్‌జీవోస్, సఖీ, భరోసా, షీ టీమ్ సిబ్బంది, ఇతర మహిళలతో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే 1098 టోల్‌ప్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలన్నారు. విద్యార్థినుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తమ తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఎన్‌జీవోస్ సంస్థ వారి చేత బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భరోసా, సఖీ, షీటీమ్ సిబ్బంది, న్యాయసేవ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అందరి కృషి అవసరం
హుస్నాబాద్: బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు సివిల్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. బాల్య వివాహాల వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిర్మూలన అందరి బాధ్యత
జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment