ఏబీసీ యూనిట్ పరిశీలన
సిద్దిపేటజోన్: మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) యూనిట్‌ను బుధవారం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని అరా తీశారు. కుక్కలను సంరక్షించే గదులను పరిశీలించారు. అనంతరం అక్కడి సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని పర్యవేక్షించారు. తయారీ చేసిన సేంద్రియ ఎరువులు ఎవరెవరికి విక్రయిస్తున్నారని అరా తీశారు. రైతులను చైతన్యం చేసి, సేంద్రియ ఎరువులు వాడేలా చూడాలని సూచించారు. ఆయన వెంట అర్బన్ తహసీల్దార్ సలీమ్ మియ్యా, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్, సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment