రేపటి నుంచి సిటీ పోలీస్‌యాక్టు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు సిటీ పోలీస్‌యాక్టు అమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, సభలు, సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. అదే విధంగా సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కూడా పొడిగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సన్న ధాన్యాన్ని
దళారులకు అమ్ముకోవద్దు
డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య
జగదేవ్‌పూర్(గజ్వేల్): దళారులకు సన్నరకం ధాన్యం అమ్ముకుని మోసపోవద్దని, ప్రభుత్వం సన్నరకానికి బోనస్ ఇస్తోందని డీఆర్డీఏ పీడీ జయదేవ్‌ఆర్య అన్నారు. బుధవారం మండలంలోని మునిగడపలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ కొనుగోలు కేంద్రం రైతులకు దూరమైతే స్థానికంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అలాగే కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ప్రతి రైతు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి బోనస్ పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, డీపీఎం వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతోనే
సమాజంలో గుర్తింపు
డీఐఈఓ రవీందర్ రెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని.. విద్యార్థులు పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఫుట్‌బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థిని చైతన్యశ్రీని సన్మానించి, జాతీయ స్థాయిలో కళాశాలకు పేరు తేవాలని సూచించారు.
హెచ్‌ఎంల సంఘం
జిల్లా అధ్యక్షుడిగా కరీమొద్దీన్
గజ్వేల్: గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కరీమొద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం సిద్దిపేటలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా చింతమడక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాజిరెడ్డి, కోశాధికారిగా అంతక్కపేట హెచ్‌ఎం చంద్రశేఖర్‌లు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి మెదక్ జిల్లా శాఖ గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు సత్యం ఎన్నికల అధికారిగా వ్యవహరించగా రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డిలు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.
కాంగ్రెస్ జిల్లా
ఉపాధ్యక్షుడిగా పాండు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మంద పాండు నియమితులయ్యారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి నియామకపత్రాన్ని గజ్వేల్‌లో అందించారు. తన నియామకానికి కృషి చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, నర్సారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment