రోడ్ల విస్తరణకు నిధులివ్వండి
హుస్నాబాద్: నియోజకవర్గంలోని పలు రోడ్ల విస్తరణకు, హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో గడ్కరిని కలిసి విన్నవించారు. కోహెడ నుంచి దేవక్కపల్లికి, నాగ సముద్రాల, అక్కన్నపేట వయా రామవరం నుంచి జనగామ వరకు రోడ్లను విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. అలాగే గుగ్గిళ్ల నుంచి తంగలపల్లి, తంగలపల్లి వయా గుండారెడ్డి పల్లి నుంచి బద్దిపడిగ వరకు రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గుంటూరు పల్లి నుంచి కేశావపూర్ వరకు, కోతులనడుమ, ముల్కనూర్ వయా గోపాల్‌పూర్ వరకు, కోతుల నడుమ నుంచి జగన్నాఽథపురం వయా జిలుగుల, పెంచికల్ వరకు రోడ్ల విస్తరణ చేపడతామని తెలిపారు. వంగర హుజురాబాద్ నుంచి కన్నారం వరకు, బొమ్మనపల్లి నుంచి డబుల్ లేన్ పొలంపల్లి వరకు చేపట్టనున్నామన్నారు. హుజురాబాద్ నుంచి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ, అలాగే హైలెవల్ బిడ్రి నిర్మాణం చేపడతున్నట్లు తెలిపారు. మొలంగూర్, సైదాపూర్ మద్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, కొత్తగట్టు, దుద్దెనపల్లి మద్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మానకొండూరు, హుస్నాబాద్ మద్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరిని కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి గడ్కరిని కోరిన
మంత్రి పొన్నం
Comments
Please login to add a commentAdd a comment