రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి
సిద్దిపేటకమాన్: రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట కోర్టు భవనంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆమోదించిన రోజు నవంబర్ 26 అని తెలిపారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని తెలిపారు. భారత రాజ్యాంగ ప్రవేశికను కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది చేత న్యాయమూర్తి చదివించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్ కాంబ్లి, శ్రావణియాదవ్, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ మంతూరి సత్యనారాయణ, న్యాయవాదులు రవీందర్, బాలయ్య, రామారావు, భూంరెడ్డి, శివాజీ, రాజలింగం, పత్రి ప్రకాష్, నవీన్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
Comments
Please login to add a commentAdd a comment