
BCCI in dilemma between Rohit Sharma and Ajinkya Rahane for Test captaincy: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగబోయే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2021లో జట్టును సెమీస్ కూడా చేర్చలేక నిరాశతో టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. నవంబరు 17 నుంచి కివీస్‌తో మొదలుకానున్న టీ20 సిరీస్ నుంచి పూర్తిస్థాయి సారథిగా హిట్‌మ్యాన్.. పగ్గాలు చేపట్టనున్నాడు. కేఎల్ రాహుల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలన్న విషయంలో బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ వైపు మొగ్గు చూపాలా? లేదంటే ఇన్నాళ్లుగా వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలా? అన్న విషయంలో సందిగ్దంలో పడినట్లు తెలుస్తోంది. ఇక భారత జట్టు నూతన హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సిరీస్‌తో తన ప్రస్థానం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది.
కాగా మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఐపీఎల్, ప్రపంచకప్ టోర్నీలతో బిజీగా గడిపిన కొంతమంది ఆటగాళ్లకు బీసీసీఐ ఈ సిరీస్ నుంచి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి టెస్టుకు కోహ్లి దూరం కాగా.. రెండో టెస్టు నుంచి జట్టుతో చేరనున్నాడు.
షెడ్యూల్:
►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్.
►రెండో టీ20- నవంబరు 19, రాంచి.
►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా.
►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్.
►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.
చదవండి: T20 WC Final: మోర్గాన్ చెత్త వ్యూహం.. అతడు చేసిన తప్పు అదే.. ఫైనల్‌లో ఆ రెండు జట్లే: అక్తర్
Harbhajan Singh: 62 నాటౌట్, 70, 79 నాటౌట్.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే సెలక్ట్ చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment