West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ట్రినిడాడ్‌కు చేరుకున్న రోహిత్ సేన క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే భారత జట్టు 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
స్పిన్‌కు అనుకూలించిన డొమినిక పిచ్‌పై టీమిండియా స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిప్పేయడంతో ఆతిథ్య జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. టర్నింగ్ పిచ్‌పై అశూ ఏకంగా 12 వికెట్లు పడగొట్టగా.. జడ్డూ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పిన్నర్లు తిప్పేయడంతో..
మరోవైపు.. ఓపెనర్లు రోహిత్ శర్మ(103), యశస్వి జైశ్వాల్ (171)సెంచరీలతో చెలరేగడం టీమిండియాకు కలిసివచ్చింది. స్పిన్నర్ల మాయాజాలం, ఓపెనర్ల శుభారంభంతో టీమిండియాకు విజయం నల్లేరు మీద నడకే అయింది. ఏకంగా ఇన్నింగ్స్ మీద 141 పరుగులతో గెలుపు భారత్ సొంతమైంది.
దీంతో స్పిన్‌కు అనుకూలించే పిచ్ తయారు చేయించి తమ గొయ్యి తామే తీసుకున్నారంటూ విండీస్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పిచ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. అదే విధంగా టీమిండియాలో మార్పులపై చర్చ జరుగుతోంది.
డొమినికాలో అలా..
ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు ప్రెస్‌తో మాట్లాడిన భారత సారథి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డొమినికాలో పిచ్ చూడగానే మాకు పూర్తి అవగాహన వచ్చింది. అక్కడి పరిస్థితులు కూడా అవగతమయ్యాయి.
కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు. వర్షం పడే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే, పిచ్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని జట్టు కూర్పుపై అప్‌డేట్ ఇచ్చాడు.
జూనియర్లకు అర్థమయ్యేలా
ఇక జట్టులోకి యశస్వి జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్ల రాక గురించి మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా మార్పు అనేది ఉండాలి. అది ఈరోజైనా రేపైనా కావొచ్చు. అయితే, మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సీనియర్లుగా వాళ్లకు మేం చెప్పాలో అది చేతల్లో చూపిస్తున్నాం. వాళ్ల పాత్ర ఏమిటో అర్థమయ్యేలా చెబుతున్నాం.
వాళ్లకు నో ఛాన్స్!
ఇప్పుడు వాళ్ల వంతు. మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవ్వాలి? ఎలా ఆడాలి అన్నది వాళ్లే చూసుకోవాలిక’’ అని సీనియర్లు, జూనియర్లను ఉద్దేశించి రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా జూలై 20 నుంచి విండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.
ఇదిలా ఉంటే.. స్పిన్ విభాగంలో అశూ, జడ్డూలతో పాటు అక్షర్ పటేల్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పేసర్లకు ఛాన్స్ ఇచ్చే క్రమంలో సిరాజ్‌తో పాటు ముకేశ్ కుమార్‌ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్‌లపై వేటు పడే అవకాశం ఉంది.
చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
రోహిత్ తిరిగి వచ్చేశాడు! యశస్వి జైశ్వాల్ తొలిసారి.. కోహ్లి మాత్రం
Comments
Please login to add a commentAdd a comment