Photo Courtesy :IPL
ధావన్ క్లాస్ ఇన్నింగ్స్.. ఢిల్లీ ఘన విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 17.5 ఓవర్లలోనే చేధించింది. శిఖర్ ధావన్ (67, 47 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించగా.. చివర్లో హెట్‌మైర్ 16 పరుగులు నాటౌట్ ( 2 సిక్సర్లు, 1 ఫోర్ ) అలరించాడు. అంతకముందు పృథ్వీ షా 39, స్మిత్ 24 పరుగులు సాధించారు. పంజాబ్ బౌలర్లలో మెరిడిత్, జోర్డాన్, హర్‌ప్రీత్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్( 99, 58 బంతులు; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మలాన్ 26 పరుగులు చేయగా.. మిగతావారు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబడ 3, ఆవేశ్‌ఖాన్, అక్షర్ పటేల్‌లు చెరో వికెట్ తీశారు.
ధావన్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ 126/2
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం దిశగా సాగుతుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 14 ఓవర్లలో 126/2 గా ఉంది. ధావన్ 56, పంత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 24 పరుగులు చేసిన స్మిత్ మెరిడిత్ బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు
11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 96/1
11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. ధావన్ 33, స్మిత్ 22 పరుగులుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా((39) హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
6 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 63/0
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్‌లు నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డు ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతం జట్టు స్కోరు 6 ఓవర్లలో 60/0 గా ఉంది. పృథ్వీ షా 39 ధావన్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు
మయాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్
పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మయాంక్ అగర్వాల్( 99, 58 బంతులు; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మలాన్ 26 పరుగులు చేయగా.. మిగతావారు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబడ 3, ఆవేశ్‌ఖాన్, అక్షర్ పటేల్‌లు చెరో వికెట్ తీశారు.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్.. 132/5
పంజాబ్ కింగ్స్ షారుఖ్ ఖాన్(4) రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మయాంక్ 72, జోర్డాన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా పంజబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ క్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
వెనువెంటనే రెండు వికెట్లు.. పంజాబ్ 90/4
పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. మొదట మలాన్‌ను(26) అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత మూడో బంతికి హుడా నాటకీయంగా రనౌట్ అవ్వాల్సి వచ్చింది. మయాంక్ షాట్ ఆడి కాల్‌కు పిలుపునివ్వగా.. హుడా క్రీజు దాటాడు. అయితే హెట్‌మైర్ బంతిని అందుకోవడంతో హుడా వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే మయాంక్ కూడా హుడా ఉన్నవైపు రావడంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకేదిశలో ఉండడంతొ అక్షర్ పటేల్ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. దీంతో హుడా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం పంజాబ్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
12 ఓవర్లలో పంజాబ్ స్కోరు 78/2
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. మయాంక్ 28, మలాన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పంజాబ్ గేల్(13), ప్రబ్‌సిమ్రన్(12) వికెట్లను కోల్పోయింది.
గేల్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
13 పరుగులు చేసిన క్రిస్ గేల్ రబడ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. మయాంక్ అగర్వాల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ డౌన్.. పంజాబ్ స్కోరు 18/1
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ రబడ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మయాంక్ 5, గేల్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో పంజాబ్ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడుతుంది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికరపోరు జరగనుంది. గత మ్యాచ్‌లోకేకేఆర్‌పై ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఢిల్లీని పంజాబ్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. ఇక పంజాబ్ కూడా గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడించి ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తుంది. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.అయితే ఈ మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇక ఇరుజట్ల ముఖాముఖి పోరును పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో పంజాబ్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులుకాగా.. ఢిల్లీపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 202 పరుగులుగా ఉంది. ఇక గత సీజన్‌లో రెండుసార్లు తలపడగా.. ఒక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ను విజయం వరిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, ధవన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్‌మైర్, స్టొయినిస్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రబాడ, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, షమీ, రవి బిష్ణోయి, రిలే మెరిడిత్, ప్రబ్‌సిమ్రన్ సింగ్, హర్‌ప్రీత్ బార్
Comments
Please login to add a commentAdd a comment