టీమిండియా సరికొత్త ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయం.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వీరిద్దరూ తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
యశస్వి జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు చేయగా.. రోహిత్ 80 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, జైస్వాల్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. విదేశీ సిరీస్‌లలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాల నెలకొల్పిన భారత ఓపెనింగ్ జోడీల జాబితాలో రోహిత్- జైశ్వాల్ చేరారు.
అంతకుముందు సునీల్ గవాస్కర్-చేతన్ చౌహాన్, వీరేంద్ర సెహ్వాగ్-ఆకాశ్ చోప్రా, సెహ్వాగ్-వసీమ్ జాఫర్‌లు రెండు సార్లు విదేశాల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్, జైశ్వాల్ జోడికి కూడా ఇది రెండో సెంచరీ భాగస్వామ్యం.
అదే విధంగా ఒక సిరీస్‌లో వరుసగా రెండు సార్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రెండో భారత ఓపెనింగ్ జోడిగా రోహిత్, జైశ్వాల్ నిలిచారు. అంతకుముందు 1999లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఎస్ రమేష్, గాంధీ ఈ అరుదైన ఘనత సాధించారు. తాజాగా 24 ఏళ్ల తర్వాత రోహిత్-జైశ్వాల్ జోడీ ఈ ఘనత సాధించింది. ఇక ట్రినిడాడ్‌లో అత్యధిక భాగస్వామ్యంగా నెలకొల్పిన భారత ఓపెనింగ్ జోడిగా రోహిత్-జైశ్వాల్ నిలిచారు.
చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! ఎంతమందిరా నాయనా!
Comments
Please login to add a commentAdd a comment