![Rohit Sharma hails bowlers for win in 1st ODI Against England](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/rohit-sharma.jpg.webp?itok=Z7aQR59g)
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా(Teamindia) అద్భుతమైన విజయంతో ఆరంభించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్(England)ను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.
గిల్, అయ్యర్ మెరుపులు..
అనంతరం 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2),యశస్వి జైస్వాల్(15) వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్ ఓవైపు ఆచితూచి ఆడినప్పటికి.. అయ్యర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ ఔటైన తర్వాత గిల్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాడు.
అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ సైతం దూకుడుగా ఆడాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా(12),హార్దిక్ పాండ్యా(9) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ కుర్రాళ్ల ప్రదర్శనపై హిట్‌మ్యాన్ సంతోషం వ్యక్తం చేశాడు.
"తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము ఈ ఫార్మాట్‌లో ఆడాము. వీలైనంత త్వరగా తిరిగి రీగ్రూప్ అయ్యి విజయం కోసం ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టాలనుకున్నాము. మా అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో మేము రాణించాము.
అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. కానీ మా బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇది సుదీర్ఘమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌లోనూ మలుపులు ఉంటాయి. అంతేతప్ప మ్యాచ్ మన చేతి నుంచి చేజారిపోయిందని కాదు.
తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చే స్కిల్స్ మన వద్ద ఉండాలి. ఈ క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది. నిజంగా వారి వల్లే తిరిగి గేమ్‌లోకి వచ్చాము. మిడిలార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని భావించాము. అందుకే అక్షర్ పటేల్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాము.
అక్షర్ పటేల్ బ్యాట్‌తో ఏమి చేయగలడో మనందరికి తెలిసిందే. అతడు తానెంటో మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ సైతం అద్భుతంగా ఆడాడు. గిల్, అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. ఛాపింయన్స్ ట్రోఫీ ముందు మాకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నామని" పోస్ట్ మ్యాచ్‌ప్రెజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment