Virat Kohli: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారధి విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరో ఫోర్ కొడితే లీగ్ చరిత్రలో 550 బౌండరీలు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ క్రమంలో కోహ్లి ఓ ఐపీఎల్ స్పెషల్ రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 550 ఫోర్లు, 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 209 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీల సాయంతో 6336 పరుగులు చేసి ఐపీఎల్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 549 బౌండరీలు, 212 సిక్సర్లు ఉన్నాయి.
కాగా, ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్ల రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. ధవన్ ఇప్పటివరకు 195 మ్యాచ్‌ల్లో 664 ఫోర్లు బాదాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 509 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల రికార్డు యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ (355) పేరిట ఉండగా, 212 సిక్సర్లు బాదిన కోహ్లి ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరో మూడు సిక్సర్లు కొడితే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ (214)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకుతాడు.
చదవండి: IPL 2022: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్‌సీబీ లైవ్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment