Shubman Gill Fined 115 Percent By ICC - Sakshi
Sakshi News home page

WTC FINAL: శుబ్‌మన్‌ గిల్‌కు బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా

Published Mon, Jun 12 2023 1:49 PM | Last Updated on Mon, Jun 12 2023 2:21 PM

Shubman Gill Fined 115 Per Cent By ICC - Sakshi

ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ జరిమానా
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడిన భారత్‌, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ గట్టిషాక్‌ ఇచ్చింది. స్లోఓవర్‌ రేటు కారణంగా ఇరు జట్లకు భారీ జరిమానా విధించింది. టీమిండియాకు 100 శాతం, ఆసీస్‌కు 80 శాతం మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది.

టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు కూడా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ భారీ షాక్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా అంపైర్‌ నిర్ణయాన్ని విమర్శించినందుకు గిల్‌కు 15 శాతం జరిమానా (మ్యాచ్‌ ఫీజ్‌తో కలుపుకుని మొత్తం 115 శాతం జరిమానా) విధించింది.  ఐసీసీ నిబంధనల్లోని 2.7 నియమాన్ని గిల్‌ ఉల్లంఘించినందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్‌ ఔటైన తీరు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్‌ అంపైర్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశాడు. కామెరాన్‌ గ్రీన్‌ చేతిలోని బంతి నేలను తాకుతున్నట్టుగా కనిపించే చిత్రాన్ని జత చేశాడు.

రెండు భూతద్దాలు, తలను చేత్తో కొట్టుకుంటున్న ఎమోజీలను పెట్టాడు. సాధారణంగా ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు. అంతకమించి బహిరంగంగా విమర్శలు కూడా చేయకూడదు. ఈ క్రమంలోనే గిల్‌కు ఊహించని షాక్‌ తగిలింది.
చదవండి: WTC FINAL: ఐపీఎల్‌లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై మాజీ లెజెండ్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement