ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ సంచలనం యశస్వీ జైశ్వాల్‌కు తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ప్రధాన జట్టులో జైశ్వాల్‌కు చోటు దక్కనప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభిస్తుందో వేచి చూడాలి. ఒక వేళ తుది జట్టులో చోటు దక్కినప్పటికీ.. ఏ స్ధానంలో బ్యాటింగ్‌కు పంపిస్తారా అన్నది ప్రస్తుతం అందరి మొదడలను తొలుసున్న ప్రశ్న.
ఎందుకంటే ఇప్పటికే శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రూపంలో ఇద్దరి ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఈ క్రమంలో జైశ్వాల్‌ను మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని పలువురు సూచిస్తున్నారు. ఇక ఇదే విషయంపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తన అభిప్రాయాలను వెల్లడించాడు. విండీస్ సిరీస్‌లో గిల్‌ను పుజారా స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని భోగ్లే అన్నాడు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో గిల్‌ను మూడో స్ధానంలో జట్టు మెనెజ్‌మెంట్ పంపే అవకాశం ఉంది. జైశ్వాల్‌ను రోహిత్ జోడిగా పంపాలి. జైశ్వాల్ అద్భుతమైన ఆటగాడు. అతడికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఓపెనర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఈ సిరీస్‌లో యశస్వీ అద్భుతాలు సృష్టించగలడు అని ట్విటర్‌లో భోగ్లే పేర్కొన్నాడు.
ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో జైశ్వాల్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అతడు 26 ఇన్నింగ్స్‌లలోనే అతను 80.21 సగటుతో 1845 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో 213, 144 పరుగులు చేశాడు.
చదవండి: లంక లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! బ్రెట్ లీ సైతం..
Comments
Please login to add a commentAdd a comment