‘ఉపాధి’లో తెలుగు తమ్ముడి చేతివాటం | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో తెలుగు తమ్ముడి చేతివాటం

Published Sat, Nov 30 2024 12:24 AM | Last Updated on Sat, Nov 30 2024 12:24 AM

-

సొంత పార్టీ నాయకులే వెల్లడి

ఇందుకూరుపేట: ఉపాధి పనుల్లో కొమరికకు చెందిన టీడీపీ నాయకుడు మునగశెట్టి మనోహర్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆ పార్టీ నేతలే ఆరోపించారు. శుక్రవారం ఆ గ్రామంలో తాతా వెంకటేష్‌ అనే మరో నాయకుడు విలేకరుల సమావేశం నిర్వహించి సొంత పార్టీ నేతల అవినీతిని బహిర్గతం చేశాడు. వెంకటేష్‌ మాట్లాడుతూ కాలువ పూడికతీత పనులు సక్రమంగా చేయడం లేదన్నారు. దీంతో సాగునీటి విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. మనోహర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ద్వారా 60 మంది పేర్లను నమోదు చేసి 20 మంది చేత మాత్రమే పనులు చేయిస్తున్నారన్నారు. అలాగే అతని భార్య పేరు సైతం నమోదు చేయించాడని ఆరోపించారు. ఇష్టానుసారంగా పేర్లు నమోదు చేసి నగదును కాజేస్తున్నారని తెలిపారు. గిరిజనులకు పని చూపించకుండా దోచుకుంటున్నట్లు చెప్పారు. ఈ అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాన్నారు. సమావేశంలో బత్తిన రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement