రైల్లోంచి జారిపడి యువకుడి మృతి
నెల్లూరు (క్రైమ్): రైల్లోంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం వేదాయపాళెం రైల్వేగేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే రైలు పట్టాలపై జరిగింది. మృతుడికి 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయి. నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీషర్టు, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రమా ద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్‌ఐ జి. మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వవ్వేరులో ఇరువర్గాల
మధ్య వివాదం
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డు వవ్వేరులో మంగళవారం ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. టీడీపీకి చెందిన చోటా నేత కనిగిరి రిజర్వాయర్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కాపాడుకునేందుకు గ్రామంలో మత ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. తమిళనాడు, నెల్లూరుతోపాటు బుచ్చిరెడ్డిపాళెం నుంచి కొందరిని తీసుకొచ్చాడు. వాళ్లు ప్రతి కూడలి వద్ద మైకుల ద్వారా ప్రచారం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఫొటోలు తీస్తుండగా ప్రచారం కోసం వచ్చిన వ్యక్తి ఫోన్ లాక్కున్నాడు. అదే సమయంలో బుచ్చిరెడ్డిపాళెం నుంచి బీజేపీ నాయకులు రాగా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చెరువును ఆక్రమించి నిర్మించిన భవనం కోసం మతం ముసుగు వేయడం ఏమిటని నాయకులు నిలదీశారు. దీంతో తమిళనాడు నుంచి వచ్చిన వారు ఈ ప్రాంతానికి రామని చెప్పి వెళ్లిపోయారు.
సరుడు దోపిడీపై
పోలీసులకు ఫిర్యాదు
సంగం: తన ఇంట్లో నిద్రిస్తుండగా మెడలోని బంగారు సరుడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకెళ్లారని మండలంలోని పడమటిపాళెంకు చెందిన అయ్యప్ప అనే వృద్ధురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 15వ తేదీ ఇంట్లో నిద్రిస్తుండగా సరుడు లాక్కెళ్లారని, తనకు ఎవరూ లేకపోవడంతో ఫిర్యాదు చేయలేకపోయానని పేర్కొంది. ఈ విషయమై గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని, కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు తెలియజేసింది. చివరకు గ్రామ పెద్దల సూచన మేరకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించింది. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యంపై
ఫిర్యాదు
సంగం: మండలంలోని పెరమనకు చెందిన ఓ యువతి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. ఆమె సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదంటూ మంగళవారం తల్లిదండ్రులు సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆమె తండ్రి ఇంట్లో నిద్రించి సా యంత్రం లేచి చూసే సరికి కనిపించలేదు. దీంతో బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధాన్యం సేకరణకు
సన్నద్ధంగా ఉండాలి
● జేసీ కార్తీక్
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ధాన్యం సేకరణకు పీఏసీఎస్ సంఘాలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జేసీ, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కార్తీక్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మంగళవారం మహాజనసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) బలోపేతానికి డీసీసీబీ విరివిగా రుణాలు అందించాలని సూచించారు. పీఏసీఎస్‌ల్లో కంప్యూటరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా పీఏసీఎస్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. పీఏసీఎస్ సభ్యత్వం ఉన్న రైతులకు ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాలని, డీసీసీబీ డిపాజిట్ల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ గుర్రప్ప, డీసీసీబీ సీఈఓ శ్రీనివాసరావు, నాబార్డ్ డీడీఎం డాక్టర్ బాబు, అధికారులు, పీఏసీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment