సాఫ్ట్‌బాల్ టోర్నీ విజేత ‘విజయనగరం’
వజ్రకరూరు: రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ సాఫ్ట్‌బాల్ టోర్నీ విజేతగా విజయనగరం జట్టు నిలిచింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ వేదికగా అండర్ 17 ఎస్‌జీఎఫ్ బాలుర సాప్ట్‌బాల్ పోటీల్లో ఉత్కంఠగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడా జట్లు పాల్గొనగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టుపై విజయనగరం జట్టు గెలుపొంది విజేత ట్రోఫీని కై వసం చేసుకుంది. రెండో స్థానంలో వైఎస్సార్ జిల్లా, మూడో స్థానంలో అనంతపురం జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్లను అభినందిస్తూ ట్రోఫీలు, పతకాలను డీవైఈఓ శ్రీదేవి ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలని క్రీడాకారులకు ఆమె పిలుపునిచ్చారు. జాతీయ జట్టులో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయగా, ఇందులో కొనకొండ్ల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి సాయి కార్తీక్‌కు చోటు దక్కడంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టోర్నీ అజ్వర్వర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎసత్యసాయి జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ మొరార్జీయాదవ్, సర్పంచ్ ఇందిరమ్మ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేష్, పలువురు పీఈటీలు పాల్గొన్నారు. కాగా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment