మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు
హిందూపురం: ఎకై ్సజ్ అధికారులు సోమవారం మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. హిందూపురం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో పలు దుకాణాలను తనిఖీ చేశారు. ‘ఎనీ టైం మద్యం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో ఎకై ్సజ్ అధికారులు నియోజకవర్గంలో పలు మద్యం షాపుల్లో రోజు వారి అమ్మకాలపై తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. నిబంధనలు పక్కగా అమలు చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. ముఖ్యంగా బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేయకూడదని, అధిక ధరలకు మద్యం విక్రయించకూడదన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పలుచోట్ల దాడులు..
అక్రమ మద్యం అమ్మకాలపై హిందూపురం ఎకై ్సజ్ అధికారులు సోమవారం పలుచోట్ల దాడులు నిర్వహించారు. హోన్నంపల్లిలో కురుబ నారాయణప్ప, కల్లూరులో మూర్తి, అశోక్ అలాగే నక్కలపల్లి శీనప్పలను అరెస్టుచేసి మూడు కేసులు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. వారి నుంచి ద్విచక్ర వాహనంతోపాటు 176 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment