ప్రశాంతిగ్రాంలో మద్యం దుకాణం వద్దు
● ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు
గ్రామస్తుల వినతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని ప్రశాంతి గ్రాం వాసులు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవింద నాయక్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం వారు ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రశాంతిగ్రాంకు చెందిన పలువురు మీడియాతో మాట్లాడారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారని, ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే వారందరికీ ఇబ్బందులు కలుగుతాయన్నారు. అంతేకాకుండా ప్రశాంతి నిలయానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రశాంతి నిలయానికి 10 కి.మీ దూరం వరకూ మద్యం, మాంసం విక్రయాలు జరగకూడదని ట్రస్ట్ వర్గాలు ప్రభుత్వానికి విన్నవించాయని గుర్తు చేశారు. కానీ అధికారి పార్టీ అండదండలతో కొందరు ప్రశాంతిగ్రాంలో మద్యం దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మద్యం షాపు ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు. లేకపోతే తాము రోడ్డెక్కాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో కేశవయ్య, రవినాయక్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సౌకర్యాలున్నా
ఫలితాలు ఎందుకిలా?
● విద్యార్థులు ప్రభుత్వ బడులకు
ఎందుకు రావడం లేదో ఆలోచించాలి
● విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
కోన శశిధర్
అనంతపురం ఎడ్యుకేషన్: ‘40–50 ఏళ్ల నాటి ప్రభుత్వ బడులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. సౌకర్యాలు కూడా బెస్ట్‌గానే ఉన్నాయి. మరి ఫలితాలు ఎందుకు మెరుగ్గా ఉండటం లేదు’ అని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన సీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఎంఈఓలు, హెచ్‌ఎంలకు జరగుతున్న ‘లీడర్‌షిప్’ శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది రూపాయల ఫీజులు కట్టి రేకుల షెడ్లలో నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపుతున్నారన్నారు. నాయకత్వ లోపాలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. అందుకే శిక్షణ తప్పనిసరి చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సి ఉందన్నారు. లేదంటే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందన్నారు. విద్యా వ్యవస్థలో ప్రస్తుతం దాదాపు 45 యాప్‌లు ఉన్నాయని, అన్నీ కలిపి ఒకట్రెండ్ చేసేలా చూస్తున్నామని చెప్పారు. 8వ తరగతి పిల్లాడు 3వ తరగతి గణితాలు చేయకపోవడం బాధాకరమన్నారు. రానున్న డీఎస్సీతో టీచర్ల కొరత తీరుతుందని, ఇక కావాల్సిందంతా నాణ్యమైన విద్య అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు. ఒక్క విద్యార్థి ఫెయిల్ అయినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
బంగారు దుకాణాలపై విజి‘లెన్స్’
అనంతపురం క్రైం: నగరంలోని బంగారు దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గాంధీబజార్‌లోని బంగారు దుకాణాల్లో డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో సోదాలు చేశారు. తూకాల్లో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. తూకాల్లో మిల్లీగ్రాముల మేర తేడా ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై తూ.కొ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, వారు కేసులు నమోదు చేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment