13 బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం
హిందూపురం అర్బన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కొల్లకుంట గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య, ఎస్‌ఐలు పృథ్వీరాజ్, ఫారూక్, సిబ్బంది బుధవారం తనిఖీలు చేపట్టారు. ఎకై ్సజ్ అధికారులను రాకపై సమాచారం అందుకున్న మద్యం విక్రేతలు నరసింహమూర్తి, ఆయన కుటుంబసభ్యులు మంజునాథ్, జయమ్మ ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో కొట్నూరు సచివాలయ అధికారులు డి.నరేష్, రవితేజ సమక్షంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన ఎకై ్సజ్ అధికారులు... మొత్తం 13 బాక్సుల్లోని 1,248 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.80 వేలుగా అంచనా వేశారు. కాగా, మంజునాథ్‌పై హిందూపురం ఎకై ్సజ్ కార్యాలయంలో 4 కేసులు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో ఒక్కో కేసు నమోదైనట్లుగా సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment