ప్రజల భాగస్వామ్యంతోనే నేర నియంత్రణ
పుట్టపర్తి టౌన్: ‘‘ప్రజల భాగస్వామ్యంతో నేర నియంత్రణ సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతి పోలీసు అధికారి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా విజుబుల్ పోలీసింగ్ పెంచాలి. తద్వారా నేరాలు జరగకుండా చూడవచ్చు’’ అని ఎస్పీ రత్న పోలీసు సిబ్బందికి సూచించారు. బుధవారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు వివరాలు తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం కేసులు ఛేదింపులో ప్రతిభ కనబరిచిన 26 మంది పోలీసులకు ఆమె ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య, పోక్సో కేసులపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తే క్రైమ్ రేటు తగ్గించవచ్చన్నారు. ప్రత్యేక కార్యాచరణతో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అందిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విజుబుల్ పోలీసింగ్ పెంచి నేరాలు నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. గ్రామ సందర్శన, పల్లె నిద్ర కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. మట్కా, పేకాట, గంజాయి తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు. దీర్ఘకాలిక కేసుల దర్యాప్తు రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, తరచూ ఫ్యాక్షన్ గ్రామాలను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. అలాగే డిసెంబర్‌లో నిర్వహించే మెగా లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. సమీక్షలో అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, వెంకటేశ్వర్లు, కేవీ మహేష్, సీఐలు శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, లీగల్ అడ్వయిజర్ సాయినాథరెడ్డితో పాటు పలువురు ఎస్‌ఐలు, సీఐలు పాల్గొన్నారు.
పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా
ప్రతి ఒక్కరూ పనిచేయాలి
లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు
పరిష్కారమయ్యేలా చూడాలి
నేర సమీక్షలో సిబ్బందికి
ఎస్పీ రత్న ఆదేశం
కేసుల ఛేదింపులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసాపత్రాలు
Comments
Please login to add a commentAdd a comment