కర్ణాటక మద్యం పట్టివేత
మడకశిర: నియోజకవర్గ పరిధిలో గురువారం ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం పట్టుబడింది. రొళ్ల మండలం టీడీపల్లి క్రాస్ వద్ద పట్టుబడిన నగేష్ నుంచి 40, ఆర్.వడ్రహట్టిలో తిప్పేస్వామి నుంచి 245 కర్ణాటక మద్యం టెట్రాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఎకై ్సజ్ ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
పాము కాటుతో వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: మండలంలోని వెంకటగిరి పాళ్యం గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర (33) పాము కాటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... రోజులాగే మంగళవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆయనను పాము కాటేసింది. పుట్టుకతో మూగ కావడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపలేక పోయాడు. బుధవారం రాత్రి కాలు వాపు గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుట్టూరులోని ఓ ఆర్‌ఎంపీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. వైద్యుడి సూచన మేరకు అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
పీజీ కోర్సులకు
స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీపీజీసెట్– 2024లో ఉత్తీర్ణులు కాకపోయినా, పరీక్ష రాయకపోయినా కేవలం డిగ్రీ ఉత్తీర్ణత ద్వారా ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ బాటనీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలియజేశారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు మొత్తం కోర్సు ఫీజు, అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉటుందని, వీరికి ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ రాదని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో ఆయా డిపార్ట్‌మెంట్ల లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment