అనంతపురం ఎడ్యుకేషన్: 2025 మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 15 వరకు గడువు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు క్రితిక శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఇంటర్ (జనరల్, ఒకేషనల్) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment