జగన్ పాలనకు ఫూలేనే ఆదర్శం
● జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని, తన ఐదేళ్ల పరిపాలనలో సంక్షేమ సామ్రాట్‌గా దేశవ్యాప్తంగా ఆయన ఖ్యాతిగాంచారంటూ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం ఫూలే చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు ఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలోనే వైఎస్ జగనన్న నడుస్తూ బీసీల అభ్యున్నతికి బాటలు వేశారన్నారు. బీసీ కులాల వారీగా కార్పొరేషన్లు, బోర్డులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నాడు వైఎస్ జగన్ నేరవేర్చారన్నారు.
సోషల్ మీడియా
యాక్టివిస్ట్ అరెస్ట్
పావగడ: సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేస్తున్నాడంటూ పావగడ తాలూకా కరెక్యాతనహళ్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రతాప్గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో బెంగుళూరులో ఉన్న నిందితుడు ప్రతాప్గౌడను గురువారం అరసికెరె పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment