డీఎస్పీ హేమంత్‌కుమార్ బాధ్యతల స్వీకరణ
ధర్మవరం అర్బన్: ధర్మవరం సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా హేమంత్‌కుమార్ బుధవారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుట్టపర్తికి వెళ్లి ఎస్పీ వి.రత్నను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. హేమంత్‌కుమార్ గతంలో తాడిపత్రిలో ట్రైనీ డీఎస్పీగా పనిచేశారు. విజయనగరం గ్రేహౌండ్స్‌లో డీఎస్పీ (ప్రొబేషన్)గా పనిచేస్తున్న ఆయన్ను...ప్రభుత్వం ఇటీవలే ధర్మవరం డీఎస్పీగా బదిలీ చేయడంతో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడున్న డీఎస్పీ ఉన్న శ్రీనివాసులు మంగళగిరి హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు.
లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలి
నల్లమాడ: లాభసాటి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు సూచించారు. నల్లమాడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం వ్యవసాయ శాఖ, ఎఫ్‌పీఓ సంయుక్త ఆధ్వర్యంలో ‘పొలం బడి’పై రైతులకు శిక్షణ నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించి సీడ్ సర్టిఫికేషన్ పొందే రైతులుగా మారాలని, తద్వారా మార్కెట్‌లో అధిక రాబడి కూడా పొందవచ్చన్నారు. వ్యవసాయంలో డ్రోన్‌ల ప్రాముఖ్యత, వాటి ఉపయోగాలను వివరించారు. అనంతరం వేరుశనగ విత్తన స్టాల్‌ను పరిశీలించారు. సీడ్ సర్టిఫికేషన్ అధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ, విత్తన సాగు నుంచి మార్కెట్‌లో విక్రయం వరకు రైతులు పాటించాల్సిన పద్ధతులు, మార్కెటింగ్‌లో మెలకువల గురించి తెలియజేశారు. పంటల సాగులో రైతులు మరింత మేలైన పద్ధతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు సత్యనారాయణ, సనావుల్లా, నల్లమాడ, ఓడీ చెరువు, అమడగూరు మండలాల వ్యవసాయాధికారులు, ఎఫ్‌పీఓ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment