పట్టాలు తప్పిన ఎలక్ట్రిక్ రైలింజిన్
గుంతకల్లు: స్థానిక విద్యుత్ లోకో షెడ్ నుంచి రైల్వే స్టేషన్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్ రైలింజన్ పట్టాలు తప్పింది. వివరాలు... మంగళవారం సాయంత్రం యలహంక–కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుసంధానం చేసేందుకు విద్యుత్ లోకోషెడ్ నుంచి రైలింజన్‌ను ప్టాల్‌ఫారం ఒకటిపైకి లోకో పైలెట్ తీసుకొస్తుండగా ఆర్‌సీడీ సమీపంలోని పాయింట్స్ వద్ద పట్టాలు తప్పింది. మూడు చక్రలు కిందికు దిగాయి. అప్రమత్తమైన లోకో పైలెట్ వెంటనే ఇంజన్‌ను ఆపేశాడు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, ఇంజనీరింగ్. ఇతర్రత విభాగాల సిబ్బంది అక్కడకు చేరుకున్ని కొన్ని గంటలు పాటు శ్రమించి రైలింజన్‌ను యథాస్థానానికి చేర్చి ముందుకు కదిలించారు. లూప్‌లైన్‌లో ఈ ఘటన జరగడం వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదు.
ఉపాధ్యాయ సమస్యలు
పరిష్కరించాలి : ఎస్టీయూ
పుట్టపర్తి టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ కార్యాలయ ఏడీ రామకృష్ణకు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. హిందూపురం పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించాలని, ప్రసుత్తం బీఈడీ చేస్తున్న క్షాత్రోపాధ్యాఉలకు టీచింగ్ ప్రాక్టీస్‌కు అననుమతించాలన్నారు. అలాగే ఇండక్షన్ ట్రైనింగ్‌కు హాజరైన 2018 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రైమరీ పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. వాయిదా పడిన భాషాపోధ్యాయుల పద్యోన్నతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనంకి చంద్రశేఖర్, ఆర్థిక కార్యదర్శి గోపాల్‌నాయక్, నాయకులు షఫీవుల్లా, వంశీ, శ్రీనివాసులు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి
ధర్మవరం రూరల్: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు ఆర్‌ఐఓ సురేష్‌బాబు సూచించారు. మంగళవారం ఆయన ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో విద్యా విషయాలపై ముచ్చటించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి, విద్యార్థినులు పాల్గొన్నారు.
వ్యక్తిపై కేసు నమోదు
కదిరి టౌన్: వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. కదిరిలోని ఓ మైనారిటీ కాలనీలో నివాసముంటున్న వివాహిత టైలరింగ్‌తో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఆమె వ్యాపార నిమిత్తం సంఘంలో రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంది. అయితే ఈ మొత్తానికి సంబంధించి కంతులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చింతకుంట మాబు.. ఆమెను లోబర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. రుణం కంతులు తాను చెల్లిస్తానని, అయితే తన కోరిక తీర్చాలంటూ తరచూ వేధించసాగాడు. వేధింపులు తారాస్థాయికి తీసుకెళ్లి తన కోరిక తీర్చకపోతే ఆమె ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు చింతకుంట మాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment