‘జోడీ’ పండు | Sakshi
Sakshi News home page

‘జోడీ’ పండు

Published Fri, Apr 19 2024 1:30 AM

గోమాతకు పండ్లు తినిపిస్తున్న 
మంత్రి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు   - Sakshi

ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లిలో నంబాడ సూర్యనారాయణకు చెందిన జీడిమామిడి తోటలో మంగళవారం ఒకే జీడిపండుకు రెండు పిక్కలు కనిపించాయి. ఈ విషయమై ఎచ్చెర్ల వ్యవసాయాధికారి సురేష్‌ మాట్లాడుతూ జన్యులోపాల వల్ల ఇటువంటివి ఏర్పడతాయని చెప్పారు.

– ఎచ్చెర్ల క్యాంపస్‌

వాసుదేవుని సన్నిధిలో మంత్రి సీదిరి

కాశీబుగ్గ: రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి, పలాస నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా గురువారం మందసలోని వాసుదేవ పెరుమాళ్‌ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నామినేషన్‌ వేయనున్న సందర్భంగా సంబంధిత పత్రాలను స్వామివారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అప్పలరాజు, శ్రీదేవి దంపతులు గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఇరువర్గాల కొట్లాట

ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలోని ఫరీదుపేటలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గురువారం కొట్లా ట జరిగినట్లు ఎచ్చెర్ల ఎస్సై చిరంజీవి తెలిపా రు. శుభకార్యం వద్ద ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారని, ఈ ఘటనలో కూన కిరణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించామ ని చెప్పారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల సొంత బావపైన జరిగిన దాడి కేసులో కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామన్నారు.

భారతీయ వారసత్వ సంపద అమూల్యం

శ్రీకాకుళం కల్చరల్‌: ఇంటాక్‌ శ్రీకాకుళం చాప్టర్‌ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని డచ్‌ భవనం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇంటాక్‌ కన్వీనర్‌ నూక సన్యాసిరావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యూఢిల్లీ ఇంటాక్‌ సంస్థ పంపిన శాశ్వత సభ్యత్వాన్ని కన్వీనర్‌ చేతుల మీదుగా జగన్మోహనరావుకు అందించారు. కార్యక్రమంలో సహాయ ఇంటాక్‌ సహాయ కన్వీనర్‌ వి.జగన్నాథంనాయుడు, నటుకుల మోహన్‌, డాక్టర్‌ చింతాడ కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

1/2

గాయపడిన 
కూన కిరణ్‌కుమార్‌
2/2

గాయపడిన కూన కిరణ్‌కుమార్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement