గూడ్సు రైలు ఎక్కి.. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి గూడ్సు ర
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు 41ఎ నోటీసులు
టెక్కలి: టెక్కలి మండలానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఆదివారం టెక్కలి పోలీసులు 41ఎ నోటీసులు జారీ చేశారు. 2022 సంవత్సరంలో టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కా ర్యకర్తలే దాడి చేశారని ఆరోపిస్తూ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్ అప్పట్లో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో జనసేన పార్టీ కార్యాలయం పై దాడి జరిగిన సందర్భంలో జై ఉత్తరాంధ్ర అంటూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు నినాదాలు చేయడం వినిపించిందంటూ స్థానికులు వెల్లడించారు. అప్పటి ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ నోటీసులు జారీ చేయడం కేవలం కక్ష పూరితమైన చర్యలు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్షన్ 448, 427, రెడ్ విత్ 34 ఐపీసీ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు బాధిత కార్యకర్తలు పేర్కొన్నారు. నోటీసుల ప్రాప్తికి త్వరితగతిన తదుపరి విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో వెల్లడించారు.
ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ
వికేంద్రీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్)ను సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment