గుండె చెరువైంది
శ్రీకాకుళం రూరల్:
పుట్టిన రోజు నాడే ఆ పిల్లాడి ఆయువు తీరిపోయింది. బర్త్ డే వేడుకలు జరగాల్సిన ఆ ఇంటిని మృత్యు దేవత నిశ్శబ్దం చేసేసింది. కలువ పువ్వులతో ఆడుకుందామని ఆశ పడిన పిల్లాడిని చెరువు మింగేసింది. మండల పరి ధిలోని గూడేం పంచాయతీ రామనర్సయ్యపే ట గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనతో ఊరి గుండె చెరువైంది. గ్రామంలో ముల్లి రాజు దంపతుల చిన్నకుమారుడు సోమశేఖర్(7) ఆదివారం పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమయ్యాడు. సాయంత్రం వరకు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ స్థానికంగా ఉన్న చెరువులో కలువ పూవులు కోద్దామని సరదా పడ్డాడు. చెరువులో దిగి పడిపోయాడు. దీన్ని చూసిన తోటి పిల్లలు కేకలు వేస్తూ గ్రామస్తులకు సమాచారం అందించారు. వారందరూ వచ్చి తీసేలోగా అప్పటికే బాలుడు ప్రాణాలు వదిలేశాడు. ఈ కుర్రాడు రెండో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. కుమారుడి పుట్టిన రోజు వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతుంటే.. చావు వార్త చెవిన పడడంతో వారు తల్లడిల్లిపోయారు. పిల్లాడి మృతితో గ్రామమంతా విషా ద ఛాయలు అలముకున్నాయి. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టిన రోజు నాడే చనిపోయిన బాలుడు
కలువ పూల కోసం వెళ్లి చెరువులో మునిగిపోయిన చిన్నారి
Comments
Please login to add a commentAdd a comment