అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

Published Fri, Aug 23 2024 3:14 AM | Last Updated on Fri, Aug 23 2024 3:14 AM

అల్లర

సూర్యాపేట టౌన్‌: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కాంగ్రెస్‌వారు చూస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌ వారు దానిని కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారని విమర్శించారు.తిరుమలగిరి ఘటనపై విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్‌ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వై.వి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, గండూరి ప్రకాష్‌, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, భిక్షం, సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్‌, పుట్టా కిషోర్‌, తాహేర్‌, ఉప్పల ఆనంద్‌ పాల్గొన్నారు.

తిరుమలగిరికి వెళ్లొద్దంటూ..

అర్వపల్లి: తిరుమలగిరిలో గురువారం నిర్వహించిన ధర్నా సందర్భంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి .. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతో కలిసి సూర్యాపేట నుంచి తిరుమలగిరికి బయలు దేరారు. కాగా సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు అడివెంల సమీపంలో జగదీష్‌రెడ్డి వాహనాలను నిలిపివేశారు. తిరుమలగిరిలో ఘర్షణ వాతావరణం నెలకొన్నందున అక్కడికి వెళ్లవద్దని మాజీ ఎమ్మెల్యే కిశోర్‌ను తామె సూర్యాపేట క్యాంప్‌ ఆఫీస్‌ వరకు తీసుకొస్తామని డీఎస్పీ రవి జగదీష్‌రెడ్డికి తెలియజేశారు. తాను ఘర్షణలకు పోవడం లేదని కాంగ్రెస్‌ నాయకుల దాడిలో గాయపడిన బీఆర్‌ఎస్‌ శ్రేణులను పరామర్శించడానికి వెళుతున్నానని జగదీష్‌రెడ్డి సమాధానం చెప్పారు. కొద్ది సేపు వాగ్వాదం జరిగాక చివరికి పోలీసులు బందోబస్తు మధ్య జగదీష్‌రెడ్డిని తిరుమలగిరిలోని కిశోర్‌ క్యాంప్‌ కార్యాలయం వరకు తీసుకెళ్లారు.

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు1
1/1

అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement